సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుʹ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన తేజస్వి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలెట్టి, ఇప్పుడిప్పుడే కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. తేజస్వి అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ʹఐస్‌క్రీమ్ʹచిత్రంతో తనకంటూ ఓ ఇమేజ్ ను సోంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు నటించిన ʹజత కలిసేʹ ఈ శుక్రవారం విడుదల సిద్దంగా ఉంది. అయితే తేజస్వి నటించిన మరో సినిమా ʹరోజులు మారాయిʹ ప్రస్తుత్రం చిత్రీరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో తేజస్వి లేడీ దొంగగా నటిస్తోంది. తేజస్వి సరసన పార్వతీశం నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో మారుతి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే సమాచారం తెలుస్తుంది

Use Facebook to Comment on this Post